Andhra Pradesh: టీడీపీ ముఖ్యనేతలతో అధినేత భేటీ.. మరికాసేపట్లో గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు!
- సమావేశానికి హాజరైన టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు
- టీడీపీ శ్రేణులపై అక్రమ కేసుల విషయమై చర్చ
- మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్ అపాయింట్ మెంట్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో ఈరోజు ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులపై ఏపీ అంతటా నమోదు చేసిన కేసులపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కోడెల మరణంపై కూడా చర్చ జరిగింది.
ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలపై విచారణ చేపట్టాలని గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని కూడా గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.