Rajnath Singh: జీ-సూట్ ధరించిన రాజ్ నాథ్.. కాసేపట్లో తేజస్ లో గగన విహారం

  • బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు నుంచి తేజస్ లో ప్రయాణించనున్న రాజ్ నాథ్
  • తేజస్ లో ప్రయాణిస్తున్న తొలి రక్షణ మంత్రిగా రికార్డు
  • తేజస్ ను స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన హెచ్ఏఎల్
భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాసేపట్లో తేజస్ యుద్ధ విమానంలో గగన విహారం చేయనున్నారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో రెండు సీట్ల తేజస్ లో ఆయన ప్రయాణించనున్నారు. 'అంతా సర్వసన్నద్ధంగా ఉంది' అంటూ ఆయన కాసేపటి క్రితం ట్వీట్ చేశారు. తేజస్ లో ప్రయాణం నేపథ్యంలో ఆయన జీ-సూట్ ధరించారు. ఈ పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. తేలికపాటి తేజస్ యుద్ధ విమానాన్ని భారత్ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసింది. మరోవైపు, తేజస్ లో ప్రయాణించిన తొలి భారత రక్షణ మంత్రిగా రాజ్ నాథ్ రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు.

తొలుత 40 తేజస్ యుద్ధ విమానాల కోసం రక్షణ శాఖ హెచ్ఏఎల్ కు ఆర్డర్ ఇచ్చింది. మరో 83 తేజస్ విమానాల కోసం గత ఏడాది మరో ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ విలువ రూ. 50 వేల కోట్లు.
Rajnath Singh
Tejas
G-Suit
BJP

More Telugu News