Valmiki-movie: ఈ ఫొటోను చిరంజీవి నాకు పంపారు: హీరో వరుణ్ తేజ్

  • చిరంజీవి నటించిన నాటి చిత్రం ‘పునాదిరాళ్లు’
  • ఈ చిత్రంలో చిరు గెటప్ ఫొటోను చూపించిన వరుణ్
  •  అదే ప్రేరణగా తీసుకున్నా

వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘వాల్మీకి’ ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ‘వాల్మీకి’లో తన లుక్ కోసం తన పెదనాన్న చిరంజీవి నటించిన నాటి చిత్రం ‘పునాదిరాళ్లు’ను ప్రేరణగా తీసుకున్నానని చెప్పాడు. ఈ చిత్రంలో చిరంజీవి లుక్ కు సంబంధించిన ఫొటోను వరుణ్ తేజ్ చూపించాడు. ఈ ఫొటోను చిరంజీవి తనకు పంపారని చెప్పాడు. అప్పట్లో హీరో అంటే ఇలాగే జుట్టుతో ఉంటారని తన అభిప్రాయమని చెప్పి, వరుణ్ నవ్వులు చిందించాడు.

More Telugu News