YSRCP: 420 శకుని మామా! కోడెల గురించి నువ్వు కూడా మాట్లాడడం విడ్డూరం: బుద్ధా వెంకన్న

  • వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బుద్ధా విమర్శలు
  • శవాలపై చిల్లర ఏరుకుని రాజకీయం చేస్తారు
  • నీకు కోడెల సాయం చెయ్యకపోతే ఇప్పటికీ జైల్లో చిప్పకూడు తినేవాడివి
కోడెల శివప్రసాద్ గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. ‘420 శకుని మామా’ అంటూ విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. శవాలపై చిల్లర ఏరుకుని రాజకీయం చేసే విజయసాయిరెడ్డి, కోడెల గురించి మాట్లాడడం విడ్డూరం’ అని విమర్శించారు.

‘రాజ్యసభ ఎన్నికలలో కోడెల గారు నీకు సాయం చెయ్యకపోతే ఇప్పటికీ జైల్లో చిప్పకూడు తినేవాడివి మరిచిపోయావా? ఒకసారి గతం గుర్తు చేసుకో! కోడెల గారి మీద కేసు పెడితే సాయం చేస్తా అని నువ్వు పెట్టిన ట్వీట్లు ప్రజలంతా చూశారు’ అని అన్నారు. కోడెల మృతిని టీడీపీ వాళ్లు రాజకీయం చేస్తున్నారని ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని ఆయనపై విమర్శలు చేశారు.  
YSRCP
vijayasaireddy
Telugudesam
Buddha

More Telugu News