Chidambaram: తీహార్ జైల్లో చిదంబరంను కలిసిన కాంగ్రెస్ నేతలు

  • మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న చిదంబరం
  • అరగంట సేపు చర్చలు జరిపిన నేతలు
  • ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ
ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో సీబీఐ, ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం ఢిల్లీలోని తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయనను కాంగ్రెస్ నేతలు గులాం నబీ అజాద్, అహ్మద్ పటేల్ కలిశారు. తీహార్ జైల్లో చిదంబరంతో దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు కశ్మీర్ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. అజాద్, అహ్మద్ పటేల్ లతో పాటు చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా జైలుకు వెళ్లారు.

Chidambaram
Azad
Ahmed Patel
Congress

More Telugu News