Kodela: కోడెల ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాలపై ఓ అంచనాకు వచ్చిన పోలీసులు!

  • సోమవారం ఆత్మహత్య చేసుకున్న కోడెల
  • కాల్ డేటాపై దృష్టిపెట్టిన పోలీసులు
  • ఆత్మహత్యకు ముందు సుదీర్ఘంగా ఫోన్ లో మాట్లాడిన కోడెల

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా కోడెల కాల్ డేటాపై దృష్టి సారించిన పోలీసులు ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాలపై ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కోడెల శివప్రసాదరావు గత 12 రోజులుగా బయటి వ్యక్తులతో మాట్లాడడంలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు 24 నిమిషాల పాటు ఓ ఫోన్ కాల్ మాట్లాడారు.

తను చనిపోయే రోజు మొత్తం 8 ఫోన్ కాల్స్ మాట్లాడారు. ఉదయం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో కూడా ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలిసింది. అదే చివరి కాల్ కాగా, 24 నిమిషాల సేపు మాట్లాడిన కోడెల ఆ తర్వాత మనస్తాపానికి గురైనట్టు సమాచారం. ఈ కాల్ మాట్లాడిన తర్వాతే కోడెల బెడ్ రూమ్ కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ చివరి కాల్ చేసింది ఎవరన్నది తేల్చే పనిలో ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు నిమగ్నమయ్యారు.  

More Telugu News