Andhra Pradesh: విశాఖలో వాణిజ్య సదస్సు.. హాజరైన 30 దేశాల ప్రతినిధులు, పెట్టుబడిదారులు!

  • ఛాంబర్ ఆఫ్ కామర్స్-ఏపీ సర్కారు సంయుక్త నిర్వహణ
  • సదస్సును ప్రారంభించిన మంత్రులు గౌతమ్ రెడ్డి, అవంతి
  • సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టామన్న గౌతమ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఫెడరేషన్, ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో వాణిజ్య సదస్సు ప్రారంభమైంది. ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సదస్సుకు 30కిపైగా దేశాలకు చెందిన ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను, ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు.

అలాగే సుగంధ ద్రవ్యాలు, వస్త్ర రంగాల్లో ఆదాయం పెంపొందించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం కోసం మరింత నాణ్యమైన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఈ సదస్సుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు.

More Telugu News