Ali: 'పండుగాడి ఫోటో స్టూడియో' రిలీజ్ కి ముహూర్తం ఖరారు

  • మళ్లీ హీరోగా వస్తోన్న అలీ
  • దర్శకుడిగా దిలీప్ రాజా పరిచయం 
  • ఈ నెల 21వ తేదీన విడుదల 

చాలాకాలం క్రితమే అలీ ఒక వైపున హాస్య నటుడిగా చేస్తూనే, మరో వైపున హాస్య కథానాయకుడిగా కూడా చేశాడు. హీరోగాను ఆయన కొన్ని హిట్లు అందుకున్నాడు. ఆ తరువాత కమెడియన్ గానే కొనసాగుతూ వస్తున్నాడు. అయితే మళ్లీ ఆయన హీరోగా ఒక సినిమా నిర్మితమైంది. ఆ సినిమా పేరే 'పండుగాడి ఫోటో స్టూడియో'. 'వీడు ఫోటో తీస్తే పెళ్లైపోయిద్ది' అనేది ట్యాగ్ లైన్.

గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ద్వారా, దిలీప్ రాజా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే విడుదల చేయాలనుకున్నారు. ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉండటం వలన వాయిదా వేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Ali

More Telugu News