Jagan: ఆరోగ్య రంగంలో సంస్కరణలపై సీఎం జగన్ కు నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ

  • కమిటీ సభ్యులు, అధికారులతో జగన్ సమీక్ష
  • ఆరోగ్య రంగంలో సంస్కరణలకు జగన్ ఉత్సాహం
  • ప్రజల ఆరోగ్య భద్రతపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారన్న మంత్రి అవంతి
రాష్ట్ర ప్రజల ఆరోగ్యం విషయంలో సీఎం జగన్ కొత్త సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నిపుణుల కమిటీ ఆరోగ్య రంగంలో సంస్కరణలపై జగన్ కు నివేదిక సమర్పించింది. నివేదికలోని అంశాలను అధ్యయనం చేసిన సీఎం జగన్ దానిపై కమిటీ సభ్యులతోనూ, అధికారులతోనూ సమీక్ష నిర్వహించారు.

అటు, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖలో ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాలను ప్రారంభించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైద్యులు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. గాంధీ విగ్రహం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య భద్రతపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
Jagan
Andhra Pradesh
Avanthi

More Telugu News