India: సరిహద్దులో పాక్ మహాకుట్ర.. ‘బ్యాట్’ దళ సభ్యులను కాల్చిచంపిన భారత్.. వీడియో!

  • భారత ఆర్మీ లక్ష్యంగా బ్యాట్ ఆపరేషన్
  • బ్యాట్ లో పాక్ ఆర్మీ, ఉగ్రవాదులు
  • అందర్నీ మట్టుబెట్టిన భారత సైన్యం
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. భారత బలగాలపై దాడి చేసి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు మహా కుట్రకు తెరలేపింది. ఇందులో భాగంగా పాక్ ఆర్మీ కమాండర్లు, ఉగ్రవాదుల కలయికగా ఏర్పడిన ‘బ్యాట్’ దళాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించాయి. దీంతో పాక్ దుశ్చర్యను ముందే పసిగట్టిన భారత భద్రతాబలగాలు ఈ దాడిని తిప్పికొట్టాయి.

భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న బ్యాట్ బృందం సభ్యులను కాల్చిచంపాయి. ఈ నెల 12-13 తేదీల మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్మీ తాజాగా విడుదల చేసింది. గతంలో భారత్ లోకి వచ్చిన పాక్ బ్యాట్ దళాలు కొంతమంది ఆర్మీ జవాన్ల తలలు నరికి తీసుకెళ్లాయి. ఈసారి కూడా అలాగే చేద్దామనుకున్న పాకిస్థాన్ కు భారత్ దీటైన జవాబు ఇచ్చింది.
India
Pakistan
Terrorist
attack
BAT

More Telugu News