Pawan Kalyan: ఈ పుస్తకం చదివితే ఎవరైనా ప్రకృతి ప్రేమికులుగా మారిపోవాల్సిందే: పవన్ కల్యాణ్

  • నల్లమల అంశంపై పవన్ పోరాటం
  • వనవాసి పుస్తకం గురించి ట్విట్టర్ లో ప్రస్తావన
  • 1938 నాటి పుస్తకం గురించి వివరణ

జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అంశంపై తీవ్రంగా దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. ఆయన తన పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా నల్లమల అంశంపైనే ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా, వనవాసి అనే అనువాద పుస్తకం గురించి పవన్ స్పందించారు. బనవాసి (తెలుగులో వనవాసి) అనే పుస్తకాన్ని 1938లో భిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ రచించారని, దాన్ని సూరంపూడి సీతారాం తెలుగులోకి అనువదించారని పేర్కొన్నారు.

తాను టీనేజ్ లో ఉండగా మద్రాస్ బుక్ ఫెయిర్ లో ఆ పుస్తకం కొన్నానని వివరించారు. ఒక్కసారి ఈ పుస్తకం చదివితే ఎవరైనా ప్రకృతి ప్రేమికులుగా మారిపోతారని, అడవుల సంరక్షణ కోసం ముందుకు కదులుతారని నమ్మకం వ్యక్తం చేశారు. వనవాసి పుస్తకం ప్రకృతిపై తన ప్రేమను మరింత పెంచిందని తన ట్వీట్ లో వెల్లడించారు. అంతేకాకుండా, జర్మన్ రచయిత పీటర్ వోలెబెన్ రచించిన ది సీక్రెట్ నెట్ వర్క్ ఆఫ్ నేచర్ పుస్తకాన్ని కూడా ట్వీట్ చేశారు.

More Telugu News