Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  ఆగ్రాలోని తాజ్ మహల్ ను తొలిసారిగా ఇప్పుడే చూశానని అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. 'తండ్రితో కలసి ఈ చారిత్రక సౌందర్యాన్ని వీక్షించానని, ఆ అందాన్ని చూసి మాటలు రాలేదని సోషల్ మీడియాలో కాజల్ పోస్ట్ పెట్టింది.  
*  చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా' చిత్రానికి బిజినెస్ పరంగా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం అన్ని భాషల శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులను జీటీవీ సొంతం చేసుకుంది. ఇందుకుగాను 125 కోట్లను జీటీవీ చెల్లించినట్టు సమాచారం.
*  కమలహాసన్ కథానాయకుడుగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భారతీయుడు 2' చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ రాజమహేంద్రవరంలో మొదలైంది. అక్కడి చారిత్రాత్మక సెంట్రల్ జైలులో ప్రస్తుతం కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నాడు.
Go Back to Shorts
Kajal Agarwal
Chiranjivi
Saira
Kamalahassan

More Telugu News