Kodela: రేపు నరసరావుపేటలో బంద్... పిలుపునిచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్

  • రేపు నరసరావుపేటలో కోడెల అంత్యక్రియలు
  • వ్యాపార, విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం
  • నరసరావుపేట చేరుకున్న కోడెల కుటుంబ సభ్యులు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయం ఈ రాత్రికి నరసరావుపేట చేరుకుంటుంది. గుంటూరు నుంచి కోడెల అంతిమయాత్ర సత్తెనపల్లి మీదుగా నరసరావుపేట చేరుకోనుంది. రేపు కోడెల అంత్యక్రియలు నరసరావుపేటలో నిర్వహించనున్నారు.

 ఈ నేపథ్యంలో, కోడెల మృతికి సంతాపంగా రేపు నరసరావుపేటలో బంద్ పాటించనున్నారు. వ్యాపార, విద్యా సంస్థలు మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చింది. కాగా, కోడెల కుటుంబ సభ్యులు నరసరావుపేట వచ్చారు. కోడెల భార్య శశికళ, కుమార్తె విజయలక్ష్మి హైదరాబాద్ నుంచి నరసరావుపేటలోని తమ నివాసానికి చేరుకున్నారు.
Kodela
Narasaraopeta
Andhra Pradesh
Telugudesam
Hyderabad

More Telugu News