Chalapathi Rao: ఆ ముగ్గురూ దూరం కావడాన్ని తట్టుకోలేకపోయాను: సీనియర్ నటుడు చలపతిరావు

  • రామారావుగారి మరణం కోలుకోని దెబ్బతీసింది
  • భవిష్యత్తు పట్ల భయం వేసింది 
  • ఈవీవీ మరణం కుంగదీసిందన్న చలపతిరావు
నటుడిగా చలపతిరావు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేస్తూ వచ్చారు. ఇంతవరకూ ఆయన 1500ల సినిమాల్లో నటించారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనలను గురించి ప్రస్తావించారు. "నేను రామారావుగారిని అమితంగా ప్రేమించేవాడిని. ఆయనను చూడకుండా ఎక్కువ రోజులు వుండలేకపోయేవాడిని.

అలాంటి రామారావుగారు చనిపోయారని తెలియగానే నా గుండె పగిలిపోయినట్టు అయింది. నాకున్న కొండంత అండను కోల్పోయినందుకు కుప్పకూలిపోయాను. భవిష్యత్తు పట్ల భయం వేసింది. ఆ తరువాత మంచి - చెడును నా మిత్రుడు దేవి వరప్రసాద్ తో షేర్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆయన చనిపోవడం కూడా మానసికంగా నన్ను బాగా కుంగదీసింది. అప్పటి నుంచి నాకు ఈవీవీతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. నాకు ఎంతో అండగా నిలిచిన ఈవీవీ కేన్సర్ తో పోయాడు. ఈ ముగ్గురూ దూరం కావడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను" అని చెప్పుకొచ్చారు.
Chalapathi Rao
Ali

More Telugu News