KOdela Siva Prasad: సూసైడ్ నోట్ ఉందేమో, అందులో తన పేరు ఉందేమోనని చంద్రబాబు కంగారుపడ్డాడు: కొడాలి నాని

  • కోడెలను బతికి ఉండగా పట్టించుకోలేదు
  • ఆయన మృతి చెందగానే బాబు కంగారుపడుతున్నాడు
  • సూసైడ్ నోట్ లేదని తెలియగానే శవరాజకీయాలకు సిద్ధపడ్డారు
కోడెల శివప్రసాదరావు బతికి ఉండగా పట్టించుకోలేదని, ఆయన మృతి చెందిన తర్వాత  చంద్రబాబునాయుడు కంగారుపడ్డారని విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,సూసైడ్ నోట్ ఏదైనా రాశారేమో, అందులో తన పేరు ఏమైనా రాశారేమోనని కోడెల మృతి తర్వాత చంద్రబాబు రెండు గంటలపాటు కంగారుపడ్డారని ఆరోపించారు. సూసైడ్ నోట్ లేదని పోలీసులు చెప్పిన తర్వాత శవరాజకీయాలు చేసేందుకు చంద్రబాబు దిగిపోయారని విమర్శించారు.

‘కోడెల శివప్రసాద్ ను వైసీపీ  చంపేసింది, జగన్మోహన్ రెడ్డి చంపేశాడు’ అంటూ చంద్రబాబు  రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై 12 కేసులు ఉన్నాయంటున్న చంద్రబాబు, ఎన్ని కేసుల్లో ఆయన స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు.
KOdela Siva Prasad
Chandrababu
Kodali Nani

More Telugu News