Chalapathi Rao: బోయపాటికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి: సీనియర్ నటుడు చలపతిరావు

  • ప్రమాదం కారణంగా బెడ్ పై వున్నాను 
  • షూటింగు కారణంగా బాధలు మరిచిపోయేవాడిని
  • బోయపాటి నేను కోలుకునేలా చేశాడన్న చలపతిరావు

విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించిన చలపతిరావు, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ బోయపాటిని గురించి ప్రస్తావించారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' సినిమాలో నేను ఒక పాత్రను పోషించాను. ఆ సినిమాకి సంబంధించి నాపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత, నేను వేరే షూటింగులో గాయపడ్డాను.

నడవలేని పరిస్థితుల్లో వున్న నాతో ఆ పాత్రను చేయించాలనే పట్టుదలతో బోయపాటి వున్నాడు. ఆయన మాటను కాదనలేక మొండి ధైర్యంతో ఓకే చెప్పేశాను .. బ్యాంకాక్ లో షూటింగ్. నేను విమానం ఎక్కలేను .. దిగలేను. అందువలన నా దగ్గరే ఉంటూ బోయపాటి నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొచ్చాడు. షూటింగు .. చుట్టూ జనం ఉండటం వలన నా బాధలు మరిచిపోయి కాస్త ముందుగానే కోలుకున్నాను. అందుకు కారణమైన బోయపాటికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి" అన్నారు.

  • Loading...

More Telugu News