Andhra Pradesh: కోడెల చనిపోయినందుకు మేమంతా సంతోషిస్తున్నాం!: వంగవీటి నరేంద్ర

  • రంగాను టీడీపీ హయాంలో చంపించారు
  • దీనివెనుక కోడెల, అప్పటి ఎస్పీ పాత్ర
  • 300 మంది పోలీసులను బదిలీ చేశారు

తెలుగుదేశం సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం పట్ల   బీజేపీ నేత వంగవీటి నరేంద్ర హర్షం వ్యక్తం చేశారు. '30 ఏళ్ల క్రితం బందరు రోడ్డులో పేదల ఇళ్ల పట్టాల కోసం వంగవీటి మోహనరంగా నిరాహార దీక్షకు దిగారు. అలాంటి ప్రజా నాయకుడిని, ప్రజాప్రతినిధిని టీడీపీ ప్రభుత్వ హయాంలో అతిదారుణంగా హత్య చేశారు'  అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఇప్పుడు చనిపోయిన కోడెలను కొన్ని మీడియా సంస్థలు ప్రజా నాయకుడని చెప్పుకుంటున్నాయి. ఇదే కోడెల, రంగా హత్య జరిగినప్పుడు హోంమంత్రిగా ఉన్నాడు. కోడెల జిల్లా ఎస్పీ సాయంతో 3 సార్లు రంగా శిబిరం వద్ద రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో చంపారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే.

రెక్కీ తర్వాత కెనాల్ గెస్ట్ హౌస్ లో వాళ్లు మీటింగ్ పెట్టుకున్నారు. పోలీస్ శాఖలో వంగవీటి మోహనరంగాకు అనుకూలంగా ఉన్న 300 మందికిపైగా పోలీసులను వారం రోజుల ముందే బదిలీ చేశారు. ఇలా కుట్రపూరితంగా రంగా చావుకు కారణమైన ముఖ్యమైనవారిలో కోడెల ఒకరు.

ఈ రోజు కోడెల శివప్రసాద్ అనే నీచుడు చనిపోయాడు. ఆయన చావుతో మేమంతా సంతోషంగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. రంగా ఎదుగుతుంటే ఓర్చుకోలేని ప్రభుత్వం ఆయన్ను తుదముట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడలోని రంగా విగ్రహం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులతో చేరుకుని ‘జోహార్ వంగవీటి రంగా.. జోహార్.. జోహార్’ అంటూ నినాదాలు ఇచ్చారు. అనంతరం రంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

More Telugu News