Nani: యూఎస్ లో దూసుకుపోతోన్న 'నానీస్ గ్యాంగ్ లీడర్'

  • తెలుగు రాష్ట్రాల్లో 'నానీస్ గ్యాంగ్ లీడర్' సందడి 
  • యూఎస్ లోను నాని మూవీ జోరు 
  • యూఎస్ లో టాప్ టెన్ చిత్రాల జాబితాలో 6వ స్థానం

నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'నానీస్ గ్యాంగ్ లీడర్' చిత్రం, ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్ల వరకూ జరుపుకున్న ఈ సినిమా, తొలి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 26.6 కోట్ల గ్రాస్ ను 15.7 కోట్ల షేర్ ను వసూలు చేసిందని అంటున్నారు.

ఇక యూఎస్ లో విక్రమ్ కుమార్ సినిమాలకి .. నాని సినిమాలకి మంచి క్రేజ్ వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ అనేసరికి మంచి కంటెంట్ తప్పని సరిగా వుంటుందనే ఉద్దేశంతో అంతా ఆసక్తిని చూపుతున్నారు. ఫలితంగా ఈ సినిమా అక్కడ 1మిలియన్ డాలర్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఈ ఏడాది అమెరికాలో విడుదలైన తెలుగు సినిమాలలో, తొలి వారంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన 'టాప్ టెన్' చిత్రాల జాబితాలో 'నానీస్ గ్యాంగ్ లీడర్' 6వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో 3వ స్థానంలో నాని 'జెర్సీ' ఉండటం మరో విశేషం.

More Telugu News