Chandrababu: ఓ మంచి కుక్కను చంపాలని 'పిచ్చి కుక్క, పిచ్చి కుక్క' అని ముద్రేశారు: చంద్రబాబు

  • పది మందీ కలిసి చంపేలా చేశారు
  • ఫర్నీచర్ తీసుకెళ్లాలని కోడెల లేఖ రాశారు
  • కానీ అధికారులే స్పందించలేదన్న చంద్రబాబు

"ఒక మంచి కుక్కను చంపాలంటే, పిచ్చికుక్క, పిచ్చి కుక్క అని ముద్ర వేసి, వెంటాడి, ఆ పిచ్చి కుక్కను పది మందీ కలిసి చంపే వరకూ వదిలిపెట్టకుండా ఏదైతే చేస్తారో... ఆ విధంగా కోడెల కేసులో జరిగింది. వేధించి, హింసించడం వల్ల మనిషి చనిపోతే ఏమనాలి?: అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తాను 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఫర్నీచర్ ను ఎన్నడూ వాడలేదని చెప్పారు. తన భార్య అందుకు అంగీకరించలేదని అన్నారు. ఓ కుర్చీ కాదుగదా, ఓ గ్లాస్, లేదా నీళ్ల బాటిల్ ను కూడా తాను ఇంటికి తేలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వస్తువులను వాడటం భువనేశ్వరికి ఇష్టం ఉండదని అన్నారు.

తన వద్ద ఉన్న ఫర్నీచర్ ను తీసుకువెళ్లాలని ప్రభుత్వం మారగానే కోడెల లేఖను రాశారని, ఆ తరువాత మరో లేఖను రాస్తూ, తానే తెచ్చివ్వాలని కోరినా, ఆ పని చేస్తానని చెప్పాడని చంద్రబాబు వెల్లడించారు. కోరితే, తన వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల విలువను లెక్కగడితే, దాన్ని చెల్లిస్తానంటూ కొత్త స్పీకర్ కు సైతం లేఖను రాశారని అన్నారు.

హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో వాడిన వస్తువులను, అమరావతిలో ప్లేస్ లేకనే, సత్తెనపల్లి, గుంటూరులోని కార్యాలయాలకు తరలించారే తప్ప, మరే విధమైన దురుద్దేశమూ లేదని అన్నారు. వాటిని కూడా తాను స్పీకర్ గా ఉంటూ, అఫీషియల్ యూజ్ కిందనే వాడానని లేఖ రాశారని అన్నారు. ఈ లేఖను కొత్త స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం చూసి, దానిపై సంతకం పెట్టి, అకనాలడ్జ్ చేశారని చెబుతూ, చంద్రబాబు సదరు లేఖను చూపించారు. కానీ అధికారులే స్పందించలేదని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News