Tejas: 'ఆర్.డి.ఎక్స్ లవ్' రిలీజ్ డేట్ ఫిక్స్

  • పాయల్ కి పెరుగుతోన్న క్రేజ్ 
  • టీజర్ కి వచ్చిన అనూహ్యమైన రెస్పాన్స్ 
  • ఈ నెల 11వ తేదీన సినిమా విడుదల 

'ఆర్.ఎక్స్ 100' సినిమాతో పాయల్ రాజ్ పుత్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఆ సినిమాలో ఆమె హాట్ హాట్ గా కనిపించడంతో, ఆమె నుంచి ఆ స్థాయి సినిమా కోసం వాళ్లంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె 'ఆర్.డి.ఎక్స్ లవ్' సినిమా చేసింది.

'హుషారు' ఫేమ్ తేజస్ హీరోగా నటించిన ఈ సినిమాను సి. కల్యాణ్ నిర్మించగా, శంకర్ భాను దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ధ్రువీకరించారు. ఇటీవల వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సీనియర్ నరేశ్ .. ఆమని .. తులసి .. నాగినీడు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

More Telugu News