Kodela siva prasad: కోడెల మృతి వార్త చాలా బాధ కలిగింది.. మనసును కలచివేస్తోంది: చంద్రబాబునాయుడు

  • గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో కోడెలకు నివాళి
  • బాలకృష్ణ ఫోన్ చేసి కోడెల మృతి వార్త చెప్పారు
  • ఈ బాధ భరించలేకపోతున్నా
కోడెల శివప్రసాదరావు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోడెల శివప్రసాద్ కు నివాళులర్పించారు. ఒక సహచరుడిని కోల్పోయిన బాధ, సీనియర్ నేతను కోల్పోయిన బాధను భరించలేకపోతున్నానని, ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

కోడెల శివప్రసాద్ మానసిక క్షోభకు, భరించలేని అవమానానికి గురయ్యారని, తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. నందమూరి బాలకృష్ణ తనకు ఫోన్ చేసి కోడెల మృతి వార్తను చెప్పడంతో షాక్ కు గురయ్యానని, ‘చాలా బాధ కలిగింది, మనసును కలచివేస్తోంది’ అని అన్నారు.
Kodela siva prasad
Telugudesam
Chandrababu

More Telugu News