Kodela siva prasad: కోడెలను ‘అన్నయ్య’ అని పిలిచే దాన్ని: నన్నపనేని రాజకుమారి

  • ‘మా చెల్లాయి రాజమ్మ’ అని ఆప్యాయంగా పిలిచేవారు
  • మేమిద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాం
  • నేనేమీ మాట్లాడలేకపోతున్నానంటూ విలపించిన నన్నపనేని
కోడెల శివప్రసాదరావు మృతిపై టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. కోడెలను ‘అన్నయ్య’ అని తాను పిలిస్తే, ‘మా చెల్లాయి రాజమ్మ’ అని ఆప్యాయంగా ఆయన తనను పిలిచేవారని గుర్తు చేసుకున్న రాజకుమారి కన్నీరుమున్నీరయ్యారు. 1983లో తామిద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని అన్నారు. కోడెల తమకు అండదండగా ఉండేవారని, ప్రోత్సహించే వారని తలచుకున్నారు. ఈ పరిణామాలను ఊహించలేకపోతున్నానని, ‘నేనేమీ మాట్లాడలేకపోతున్నాను’ అంటూ ఆమె విలపించారు.
Kodela siva prasad
Telugudesam
Nannapaneni

More Telugu News