kodela siva prasad: కోడెల మా మధ్య లేరన్నది బాధాకరం..ఓ నమ్మలేని నిజం: నందమూరి బాలకృష్ణ

  • సమాజానికి కోడెల ఎనలేని సేవలు చేశారు
  • ఎంతో మందికి ఆదర్శనీయుడు
  • ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారు
కోడెల శివప్రసాదరావు తమ మధ్య లేరన్న వార్త చాలా బాధాకరంగా ఉందని, ఓ నమ్మలేని నిజం అని టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. కోడెల ఓ రాజకీయనాయకుడిగా, వైద్యుడిగా సమాజానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, అందరి హృదయాల్లో పదిలంగా ఉంటారని అన్నారు.

 హైదరాబాద్ లో బసవతారకం ఆసుపత్రిని నిర్మించాలని తన తండ్రి ఎన్టీ రామారావు అనుకున్నప్పుడు కోడెల ముందుండి నడిచారని, ముఖ్యమైన పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. కోడెల ఎంతో మందికి ఆదర్శనీయుడని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మరిచిపోలేని సేవలు అందించారని, కోడెల ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారని అన్నారు.
kodela siva prasad
Nandamuri
Balakrishna
AP

More Telugu News