Nara Lokesh: మాజీ స్పీకర్ కోడెల మరణంపై నారా లోకేశ్ స్పందన

  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన లోకేశ్
  • కోడెల కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి
  • కోడెల ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల శివప్రసాద్ గారి మరణం పార్టీకి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా కోడెల కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న కోడెల శివప్రసాద్ గారు ఎల్లప్పుడూ ప్రజాసేవే పరమావధిగా వ్యవహరించేవారని, టీడీపీని పటిష్టం చేసేందుకు నిర్విరామంగా శ్రమించారని లోకేశ్ కీర్తించారు.
Nara Lokesh
Kodela
Andhra Pradesh

More Telugu News