Kodela: సన్నిహితులతో కోడెల తరచుగా చెబుతున్న మాటలు!

  • మాజీ స్పీకర్ కోడెల బలవన్మరణం
  • ఇటీవల పరిణామాలతో కోడెల మనస్తాపం
  • సన్నిహితుల వద్ద ఆవేదన వెలిబుచ్చిన సీనియర్ నేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజకీయనాయకుడు, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణం చెందడంతో అటు అభిమానులు, ఇటు పార్టీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో తన సన్నిహితులతో తరచుగా మాట్లాడిన కోడెల ఎంతో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

"నాకు తలవంపులు తెచ్చి, నన్ను మానసిక చిత్రవధ చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోంది. కేసుల పేరుతో వెంటాడుతూ, దర్యాప్తు పేరుతో ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయం ఇంత దిగజారుతుందని అనుకోలేదు. కక్షగట్టి నన్ను ఇలా క్షోభకు గురిచేయడం దారుణం" అంటూ సన్నిహితులతో పేర్కొన్నట్టు మీడియాలో ప్రసారమవుతోంది.
Kodela
Telugudesam
Andhra Pradesh

More Telugu News