Nayanatara: నయనతార కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు

  • నిర్మాతగా విఘ్నేశ్ శివన్ 
  • విభిన్నమైన పాత్రలో నయన్ 
  • త్వరలో మిగతా వివరాలు  

నయనతార ప్రధాన పాత్రధారిగా ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఒక సినిమాను నిర్మిస్తున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నట్టు చెప్పుకున్నారు. ఈ వార్తలను నిజం చేస్తూ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. నిన్నటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ను ఖరారు చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి 'నెట్రికన్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్లో బ్రెయిలీ లిపి కనిపిస్తోంది. అలాగే సంకెళ్లు .. కొరడా .. రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. నయనతార అంధురాలిగా కనిపించనుందా అనే ఒక సందేహం ఈ పోస్టర్ ను చూస్తుంటే కలుగుతోంది. మొత్తానికి ఈ సినిమా వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందుతుందనే విషయం మాత్రం అర్థమవుతోంది. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Telugu News