Railway Stations: 8న రైల్వే స్టేషన్లను పేల్చేస్తాం: జైషే మొహమ్మద్ పేరిట లేఖ!

  • రోహ్ తక్ పోలీసులకు అందిన లేఖ
  • లేఖ రాసిన మసూద్ అహ్మద్
  • రైల్వే స్టేషన్లలో భద్రత పెంపు
అక్టోబర్ 8వ తేదీన దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పేరిట రోహ్ తక్ రైల్వే పోలీసులకు లేఖ అందడం కలకలం రేపింది. ముంబై, చెన్నై, బెంగళూరు రైల్వే స్టేషన్లు సహా పలు ప్రాంతాల్లో బాంబులు పెడతామని అందులో ఉంది. ఈ లేఖపై మసూద్ అహ్మద్ అనే వ్యక్తి సంతకం కనిపిస్తుండగా, లేఖ హిందీలో ఉంది. తమవారిని సైనికులు ఎన్ కౌంటర్ చేస్తున్నారని, అందుకు ప్రతీకారంగానే పలు రైల్వే స్టేషన్లపై దాడులకు పాల్పడనున్నామని హెచ్చరించింది. ఇక ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించారు.
Railway Stations
Terrorists
Jaish-e-mohammad
Blast
Letter

More Telugu News