గోదావరి దుర్ఘటన: బోటు నిర్వాహకుడిపై కేసు నమోదు

- సామర్థ్యానికి మించి బోటులో ప్రయాణికులు
- దేవీపట్నం తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
- సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం
నిబంధనల ప్రకారం బోటులో 60 మంది పర్యాటకులు, ఐదుగురు సిబ్బంది ప్రయాణించాల్సి ఉండగా, నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా 71 మందితో బోటు బయలుదేరింది. బోటు తనిఖీ జరిగే దేవీపట్నం పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే పర్యాటకులు అందరూ లైఫ్ జాకెట్లు ధరించి ఉన్నారని, స్టేషన్ దాటగానే వాటిని తొలగించారని తెలుస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.