Payal Rajputh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • స్పెషల్ సాంగ్ చేయనున్న పాయల్ 
  • దర్శకుడిగా మారుతున్న కెమెరామేన్ 
  • 'ఆర్.ఆర్.ఆర్' బల్గేరియా షెడ్యూల్ పూర్తి 
*  'ఆర్ఎక్స్ 100' చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమై, తాజాగా 'ఆర్డీఎక్స్ లవ్' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ త్వరలో ఐటం సాంగ్ చేయనుంది. తేజ దర్శకత్వంలో రూపొందే తాజా చిత్రంలో స్పెషల్ సాంగులో నటించడానికి ఈ చిన్నది ఓకే చెప్పిందట.
*  తెలుగు, తమిళ భాషల్లో సినిమాటోగ్రాఫర్ గా రాణిస్తూ, తాజాగా చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రానికి పనిచేస్తున్న రత్నవేలు త్వరలో దర్శకుడిగా మారనున్నాడు. ఈ విషయాన్ని చెబుతూ, వచ్చే సంవత్సరం దర్శకత్వం వహిస్తానని, ఆ చిత్రానికి స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని రత్నవేలు తెలిపాడు.
*  రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం యూనిట్ బల్గేరియా షెడ్యూల్ ముగించుకుని హైదరాబాదుకు చేరుకుంది. త్వరలో తదుపరి షెడ్యూలును హైదరాబాదులో ప్రారంభిస్తారు. ఇందులో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి విదితమే.

Payal Rajputh
Chiranjivi
Saira
Rathnavelu
Rajamouli

More Telugu News