KCR: ‘అమరావతి’ నిర్మాణం దండగని చంద్రబాబుకు అప్పుడే చెప్పా: కేసీఆర్

  • ఎత్తిపోతలకు కరెంటుపై సభలో సమాధానం ఇచ్చిన కేసీఆర్
  • జయప్రకాశ్ నారాయణపై తీవ్ర వ్యాఖ్యలు
  • అమరావతి నిర్మాణాన్ని ‘డెడ్ ఇన్వెస్టిమెంట్’ అన్న సీఎం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం దండగని, అదో ‘డెడ్ ఇన్వెస్టిమెంట్’గా మిగిలిపోతుందని చంద్రబాబుకు అప్పుడే చెప్పానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం శాసనసభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎత్తిపోతలకు కరెంటు బిల్లులపై కేసీఆర్ మాట్లాడుతూ.. ఎత్తిపోతలకు కరెంటుపై కొందరు ఎత్తిపొడిచారని గుర్తు చేశారు.

జయప్రకాశ్ నారాయణ అనే ఆయన ఎత్తిపోతలకు కరెంటు వేస్టన్నాడని, ఆయనది ఈ రాష్ట్రం కాదు, ఈ మన్నూ కాదని విమర్శించారు. కానీ పక్క రాష్ట్రంలో రూ.53 వేల కోట్లతో అమరావతి కడుతుంటే మాత్రం డప్పు కొడతానంటాడని తీవ్ర విమర్శలు చేశారు. అది డెడ్ ఇన్వెస్టిమెంట్, కట్టొద్దు వేస్టని, దానికంటే రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తే బెటరని చంద్రబాబుకు చెప్పానని గుర్తు చేశారు. అయినా ఆయన వినలేదని, ఇప్పుడేమైందో అందరూ చూస్తున్నారని  కేసీఆర్ పేర్కొన్నారు.  
KCR
Chandrababu
amaravathi

More Telugu News