Telangana: యురేనియం తవ్వకాలపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: సీఎం కేసీఆర్

  • యురేనియం తవ్వకాలపై మేము అనుమతి ఇవ్వలేదు
  • భవిష్యత్తులో కూడా అనుమతించం 
  • యురేనియం తవ్వకాలపై రేపు సభలో తీర్మానం చేస్తాం

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకున్న అంశంపై తెలంగాణలోని పలు పార్టీల నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, యురేనియం తవ్వకాలపై ఎవరికీ ఎలాంటి అనుమతి తమ ప్రభుత్వం ఇవ్వలేదని, భవిష్యత్ లో కూడా ఇవ్వమని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై రేపటి సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. ఆ పార్టీలాగా ఆడితప్పడం, మభ్యపెట్టడం లాంటివి తాము చేయలేదని అన్నారు.

More Telugu News