Eenadu: ఆ పత్రిక యాజమాన్యం తెరవెనుక ఉద్దేశాలను బయటపెట్టింది: మంత్రి అనిల్ ఫైర్

  • ‘పోలవరం’పై ‘అస్మదీయులకు అప్పగించేందుకేనా? అంటూ ‘ఈనాడు’ కథనం
  • పోలవరం ప్రాజెక్టులో సీఎం జగన్ బంధువులెవ్వరూ లేరు
  • రివర్స్ టెండరింగ్ తర్వాత ఆ కాంట్రాక్టు ఎవరికి దక్కుతుందో తెలియదు

పోలవరం ప్రాజెక్టులో సీఎం జగన్ బంధువులెవ్వరూ లేరని, రివర్స్ టెండరింగ్ తర్వాత ఆ కాంట్రాక్టు ఎవరికి దక్కుతుందో తెలియదని  ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ‘అస్మదీయులకు అప్పగించేందుకేనా? అంటూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తపై ఆయన మండిపడ్డారు. ఆ పత్రిక యాజమాన్యం తెరవెనుక ఉద్దేశాలను బయటపెట్టిందని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ తర్వాత ఆ కాంట్రాక్టు ఎవరికి దక్కుతుందో తెలియకపోయినా ‘అస్మదీయుల కోసమే అంటూ ‘రామోజీరావుగారి పత్రిక కథనం వండి వార్చింది’ అని విమర్శించారు.

పోలవరం నిర్మాణం నుంచి వైదొలగిన నవయుగ కంపెనీకి, రామోజీరావు కుటుంబంతో ఉన్న బంధం, బంధుత్వం ఈ అసత్య కథనం రాయడానికి ప్రేరేపించిందని ఆరోపించారు. ఈ విషయం ఈనాడు పాఠకులకు తెలియాలన్న ఉద్దేశంతోనే సంబంధిత మంత్రిగా వివరణ ఇస్తున్నానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులో వందల కోట్లు చేతులు మారాయని ఈనాడు పత్రిక ఏనాడూ ఒక కథనం కూడా రాయలేదని, దీని వెనుక ఏ ప్రజల ప్రయోజనాలు ఉన్నాయని ప్రశ్నించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వందల కోట్ల మేలు జరిగే అవకాశం ఉందని తెలిసీ ‘రామోజీరావుగారు దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలి?’ అని ప్రశ్నించారు. ‘‘ఈనాడు’ వారి బంధువుల కంపెనీ కాంట్రాక్టు రద్దు అయినందుకు నిపుణులు బాధపడుతున్నారని ఆ కథనంలో రాశారు. అయితే, ఆ నిపుణులు ఎవరో ప్రస్తావించలేదు అని విమర్శించారు.

More Telugu News