Tamil Nadu: శుభశ్రీ మృతి ఎఫెక్ట్.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు కడితే ఏడాది జైలు

  • ఉత్తర్వులు జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వం
  • అనుమతి లేకుండా బ్యానర్లు కడితే ఏడాది జైలు
  • రూ.5 వేల జరిమానా

అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు కట్టేవారిపై కఠిన చర్యలకు తమిళనాడు ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అనుమతి లేకుండా బ్యానర్లు కట్టే వారికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు రోజుల క్రితం జరిగిన శుభశ్రీ మృతి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

స్కూటీపై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శుభశ్రీపై బ్యానర్ పడడంతో ఆమె లారీ చక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేసినా స్థానిక పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడింది. హైకోర్టు ఆగ్రహంతో రంగంలోకి దిగిన పళనిస్వామి ప్రభుత్వం.. బ్యానర్ల సంస్కృతిని నిర్మూలించాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News