ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హైదరాబాదీలు మృతి

15-09-2019 Sun 08:36
  • కుటుంబంతో కలిసి దుబాయ్ నుంచి ఒమన్ వెళ్తుండగా ఘటన
  • ప్రాణాపాయ స్థితిలో మూడేళ్ల చిన్నారి
  • మృతిచెందిన మరో ఇద్దరు ఒమన్ జాతీయులు

ఒమన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హైదరాబాద్ వాసులు దుర్మరణం పాలయ్యారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌కు చెందిన గౌసుల్లాఖాన్‌ కొన్నేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. శుక్రవారం సెలవు కావడంతో కుటుంబంతో కలిసి కారులో దుబాయ్ నుంచి ఒమన్ బయలుదేరాడు. కొంతదూరం ప్రయాణించాక ఎదురుగా వచ్చిన కారు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో గౌసుల్లాఖాన్‌, ఆయన భార్య అయేషా, వారి ఏడు నెలల కుమార్తె హాంజాఖాన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మూడేళ్ల చిన్నారి హానియా తీవ్రంగా గాయపడింది. కాగా, ప్రమాదానికి కారణమైన కారులోని ఇద్దరు ఒమన్ జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు.