Pawan Kalyan: పవన్ కల్యాణ్ చేస్తున్నవి పసలేని వ్యాఖ్యలు... తేలిగ్గా తీసిపారేసిన బొత్స

  • జగన్ 100 రోజుల పాలనపై పవన్ స్పందన
  • పవన్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రుల కౌంటర్
  • పవన్ కల్యాణ్ ది అనుభవ రాహిత్యమంటూ బొత్స వ్యాఖ్యలు
జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు ఘాటుగా బదులిస్తున్నారు. ఇప్పటికే అవంతి శ్రీనివాస్ కౌంటర్ ఇవ్వగా, తాజాగా బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్ కల్యాణ్ చేస్తున్నవి పసలేని వ్యాఖ్యలని కొట్టిపారేశారు. పవన్ అనుభవ రాహిత్యానికి ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్ పోలవరం రివర్స్ టెండరింగ్ అయ్యేవరకు ఆగాలని సూచించారు.

తన వ్యాఖ్యల ద్వారా పవన్ కల్యాణ్ అవినీతిపరులకు మద్దతుగా నిలుస్తున్నారని బొత్స విమర్శించారు. పవన్ ముఖ్యంగా ప్రశ్నించాల్సింది గత పాలకులను అని స్పష్టం చేశారు. చవకబారు ఉపన్యాసాలు, పెయిడ్ ఆర్టిస్టులతో కార్యక్రమాలు తమ వల్ల కాదని బొత్స వ్యాఖ్యానించారు. 100 రోజుల పాలనపై గెజిట్ విడుదల కోరడమే అవివేకం అని విమర్శించారు. రాజధాని నిర్మాణంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నది వాస్తవం అని పునరుద్ఘాటించారు. తమ ప్రయత్నమంతా ఆ అవినీతిని వెలికితీసేందుకేనని స్పష్టం చేశారు.
Pawan Kalyan
Botsa Satyanarayana
Jagan
Andhra Pradesh
YSRCP
Jana Sena

More Telugu News