New Delhi: పోలీసులకు పట్టుబడిన ఢిల్లీ 'జేమ్స్ బాండ్'!

  • ఢిల్లీలో వింత దొంగ
  • 007ను లక్కీ నెంబర్ గా భావించే కృష్ణ
  • కృష్ణపై 6 కేసులు

ఢిల్లీలో 'జేమ్స్ బాండ్ 007'గా పేరుగాంచిన కృష్ణ అనే నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ షాలిమార్ బాగ్ కు చెందిన కృష్ణ వయసు 27 సంవత్సరాలు. అతనిపై మర్డర్, హత్యాయత్నం, అక్రమంగా ఆయుధాలు కలిగివుండడం వంటి కేసులు 6 ఉన్నాయి. కృష్ణ ప్రత్యేకత ఏంటంటే, నేరాలకు పాల్పడే సమయంలో 007 నెంబర్ ముద్రించి ఉన్న టీషర్టునే ధరిస్తాడు. 007 అనేది కృష్ణ లక్కీ నంబర్. అందుకే ఢిల్లీలో ఈ నేరస్తుడు 'జేమ్స్ బాండ్ 007' గా చాలా ఫేమస్ అయ్యాడు. నెలక్రితమే కృష్ణ జైలు నుంచి విడుదలయ్యాడు. జైల్లో పరిచయమైన వినోద్ తో జతగా దొంగతనాలకు తెరదీశాడు. ఓ చోరీ చేస్తుండగా ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కూడా కృష్ణ 007 టీషర్టుతోనే ఉన్నాడు.

More Telugu News