Avanthi: చిరంజీవిలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి బొత్స... పవన్ యూటర్న్ తీసుకోవడం సరికాదు: అవంతి కీలక వ్యాఖ్యలు

  • జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై విమర్శలు
  • టీడీపీ ఉచ్చులో పడొద్దంటూ హితవు
  • రాజధాని విషయంలో యూటర్న్ తీసుకున్నారంటూ విమర్శలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎవరి పక్షమో చెప్పాలని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ నిలదీశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాము చెబుతున్నామని,  టీడీపీ ఉచ్చులో పడొద్దని పవన్ కు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో పవన్ కు తెలియదా? అంటూ ప్రశ్నించారు.

చిరంజీవిలా ఎంతో శ్రమించి పైకొచ్చిన వ్యక్తి బొత్స సత్యనారాయణ అని, ఆయనపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. రాజధాని విషయంలో పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నట్టు ఆయన మాటల ద్వారా తెలిసిపోతోందని అవంతి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు నవరత్నాలపై పవన్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Avanthi
YSRCP
Botsa Satyanarayana
Chiranjeevi
Pawan Kalyan
Jana Sena

More Telugu News