లాడెన్ కుమారుడి మృతిని ధ్రువీకరించిన ట్రంప్

14-09-2019 Sat 19:59
  • హమ్జా బిన్ లాడెన్ హతం అంటూ ఇటీవలే ప్రకటించిన అమెరికా  
  • వైమానిక దాడుల్లో హమ్జా ప్రాణాలు కోల్పోయాడన్న ట్రంప్  
  • ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లో దాడి జరిగిందని వెల్లడి
అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ హతమయ్యాడని అమెరికా అధికారులు కొన్ని వారాల కిందట ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అమెరికా దాడుల్లో హమ్జా ప్రాణాలు కోల్పోయాడని ట్రంప్ వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అమెరికా వైమానిక దళం జరిపిన కౌంటర్ టెర్రరిజమ్ దాడుల్లో మృతి చెందినవారిలో హమ్జా కూడా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అయితే ఈ దాడులు ఎప్పుడు జరిగాయన్నది మాత్రం ట్రంప్ వెల్లడించలేదు.