Virat Kohli: ఇది నాకో పాఠం నేర్పింది... ధోనీపై పెట్టిన పోస్టుకు వివరణ ఇచ్చిన కోహ్లీ

  • ధోనీ రిటైర్మెంటుపై ఊహాగానాలు
  • తాను పోస్టు పెట్టింది మ్యాచ్ గురించేనని కోహ్లీ వెల్లడి
  • ఇది తనకో పాఠం నేర్పిందంటూ వ్యాఖ్యలు
దక్షిణాఫ్రికాతో సిరీస్ కు టీమిండియా ఎంపిక రోజున కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటనకు ఇది ముందస్తు సంకేతం అని అందరూ ఊహాగానాలు చేశారు. కానీ అసలు విషయం అది కాదంటూ కోహ్లీనే స్వయంగా వివరణ ఇచ్చాడు. ఇంట్లో తీరిగ్గా ఉన్న సమయంలో ఆ పోస్టు పెట్టానని, ఓ మ్యాచ్ లో తనకు బాగా గుర్తున్న క్షణాలను ఆ పోస్టులో పేర్కొన్నానని వెల్లడించాడు. ఆ మ్యాచ్ పై తాను ఇప్పటివరకు బయట ఎక్కడా స్పందించలేదని, అందుకే సోషల్ మీడియాలో తన స్పందన వెలిబుచ్చుదామని ప్రయత్నించానని వివరించాడు. కానీ తాను ఒకవిధంగా ఆలోచిస్తే ప్రజలు మరో విధంగా స్వీకరిస్తారని ఈ పోస్టు ద్వారా అర్థమైందని కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇది తనకో పాఠం లాంటిదని అన్నాడు.
Virat Kohli
MS Dhoni
Cricket

More Telugu News