Etala Rajender: ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు ఓనరే: జగ్గారెడ్డి

  • టీఆర్ఎస్ కు ఈటల డబ్బు బాగా ఖర్చు చేశారు
  • ఎవరు మంత్రులుగా ఉన్నా జనాలకు ఒరిగేదేమీ లేదు
  • మంత్రిగా ఉన్నప్పుడు నేనేం చేశానో జనాలకు తెలుసు
మంత్రి ఈటల రాజేందర్ ముమ్మాటికీ టీఆర్ఎస్ కు యజమానే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కోసం డబ్బులు కూడా బాగా ఖర్చు చేశారని చెప్పారు. బతుకుదెరువు కోసమే గతంలో తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లానని తెలిపారు. ఎవరు మంత్రులుగా ఉన్నా జనాలకు ఒరిగేది ఏమీ లేదని... గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తాను ఏం చేశానో జనాలకు తెలుసని చెప్పారు. ప్రగతి భవన్ లో కుక్క చనిపోతే డాక్టర్ పై కేసు పెట్టారని... జ్వరాలతో వందలాది మంది చనిపోతుంటే కేసులు ఎవరిపై పెట్టాలని ప్రశ్నించారు. ఈ మరణాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని అన్నారు. బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా డబ్బులు లేవా? అని ప్రశ్నించారు.

Etala Rajender
Jagga Reddy
TRS
Congress

More Telugu News