Andhra Pradesh: చిన్నారి లేఖపై స్పందన.. నేరుగా కలెక్టర్ కు ఫోన్ కొట్టిన ఏపీ సీఎం జగన్!

  • ప్రకాశం జిల్లాలోని రామచంద్రపురంలో ఘటన
  • గ్రామపెద్దలు తమను వెలేశారని చిన్నారి ఆవేదన
  • సమస్యను పరిష్కరించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రామచంద్రపురం గ్రామంలో తమ కుటుంబాన్ని గ్రామపెద్దలు వెలివేయడంతో  కోడూరి పుష్ప అనే అమ్మాయి ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ కథనాలు పలు దినపత్రికల్లో సైతం ప్రచురితమయ్యాయి. తనతో స్కూలులో కూడా ఎవరూ మాట్లాడటం లేదనీ, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే రూ.10,000 జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారని చిన్నారి సీఎంకు విన్నవించుకుంది.

తమకు అండగా నిలవాలని నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ముఖ్యమంత్రిని కోరింది. ఈ విషయం ఎట్టకేలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లింది.  ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే బాలిక వివరాలు కనుక్కోవాలనీ, సమస్యను పరిష్కరించాలని జగన్ ఆదేశించారు.
Andhra Pradesh
Prakasam District
Expulsion
4TH class girl
Jagan
Chief Minister

More Telugu News