Amit Shah: భారతదేశం ‘హిందీ, హిందూ, హిందుత్వ’ కంటే చాలాపెద్దది!: అమిత్ షాకు ఒవైసీ కౌంటర్

  • హిందీ ప్రతీభారతీయుడి భాష కాదు 
  • మన దేశపు బహుళత్వ అందం మీకు కనిపించడం లేదా?
  • షా ‘హిందీ’ వ్యాఖ్యలపై మండిపడ్డ హైదరాబాద్ ఎంపీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హిందీ దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రాజేశాయి. భారత్ ఐక్యంగా ఉండాలంటే హిందీ వల్లే సాధ్యమనీ, కాబట్టి ప్రజలంతా హిందీని ప్రోత్సహించాలని షా పిలుపునిచ్చారు. భారత్ లో ఒకే భాష ఉండాలనీ, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని షా చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ షా వ్యాఖ్యలను తప్పుపట్టారు.

భారత్ హిందీ, హిందూ, హిందుత్వ అనే ఆలోచనల కంటే చాలా పెద్దదని ఒవైసీ తెలిపారు. హిందీ భాష ప్రతీ భారతీయుడి మాతృభాష కాదని ఆయన స్పష్టం చేశారు. ‘మీరు(అమిత్ షా) కనీసం మన దేశపు బహుళత్వపు అందాన్ని, పలు మాతృభాషలు ఉండటాన్ని హర్షించరా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 ప్రతీభారతీయుడికి భాషా, సాంస్కృతిక హక్కును కల్పిస్తోంది’ అని ఒవైసీ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News