SAVE NALLAMALA: ‘సేవ్ నల్లమల’ ఉద్యమానికి మద్దతు పలికిన టీడీపీ నేత నారా లోకేశ్!

  • ప్రజలు, పర్యావరణం కంటే అభివృద్ధి ముఖ్యం కాదు
  •  కొందరు స్వార్థ శక్తుల ప్రయోజనాల కోసమే యురేనియం తవ్వకాలు
  • భారత్ పునరుత్పాదక ఇంధనం విషయంలో లీడర్ గా మారుతోంది

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలతో పాటు సినీ నటులు విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే తమ గళాన్ని వినిపించారు. తాజాగా తెలుగుదేశం నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ‘సేవ్ నల్లమల’ ఉద్యమం విషయమై స్పందించారు. అభివృద్ధి అన్నది అవసరమేననీ, అయితే ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని పణంగా పెట్టి కాదని వ్యాఖ్యానించారు.

ఇలాంటి ప్రాజెక్టులు కొన్ని స్వార్థ శక్తుల ప్రయోజనాలను తీర్చుతాయనీ, కానీ జాతి ప్రయోజనాలను దెబ్బతీస్తాయని లోకేశ్ హెచ్చరించారు. భారత్ పునరుత్పాదక ఇంధనం విషయంలో ప్రపంచానికే నాయకత్వం వహించే స్థితికి చేరుకుంటున్నవేళ యురేనియం ఖనిజం ఎందుకని ప్రశ్నించారు. నల్లమల అడవులను రక్షించాలని లోకేశ్ ట్విట్టర్ లో పిలుపునిచ్చారు.

More Telugu News