యుద్ధం వద్దనుకుంటే పీవోకేను మీ అంతట మీరే అప్పగించండి: ఇమ్రాన్ ఖాన్ కు కేంద్రమంత్రి హెచ్చరిక
- పీవోకేను భారత్ కు అప్పగించడమే మీకు మంచిది
- పీవోకేలోని ప్రజలు భారత్ లో కలసిపోవాలనుకుంటున్నారు
- ఇది సీరియస్ మ్యాటర్ అన్న రాందాస్ అథవాలే
పీవోకేలో నివసిస్తున్న ప్రజలు పాకిస్థాన్ తో కలసి ఉండాలనుకోవడం లేదని... భారత్ లో కలసిపోవాలనుకుంటున్నారనే రిపోర్టులు వస్తున్నాయని తెలిపారు. కశ్మీర్ లోని మూడింట ఒక వంతు భూభాగాన్ని గత 70 ఏళ్లుగా పాకిస్థాన్ ఆధీనంలో ఉంచుకుందని మండిపడ్డారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని అన్నారు. పీవోకే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన వ్యూహాలు ఉన్నాయని కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలోనే అథవాలే ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.