ABN: మీడియాను అణగదొక్కే తెగులు ఏపీకి కూడా సోకింది: దాసోజు శ్రవణ్

  • ఏపీలో టీవీ5, ఏబీఎన్ లను అణచివేయాలని చూస్తున్నారు
  • గతంలో ఇలాంటి పోకడలు తెలంగాణలో చూశాం
  • భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం పిరికిపంద చర్య
ఆంధ్రప్రదేశ్ లో ఏబీఎన్, టీవీ5 మీడియా సంస్థలను అణచివేయాలని చూస్తున్నారని టీకాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. మీడియాను అణచివేయాలనుకోవడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమేనని చెప్పారు. గతంలో తెలంగాణలో ఇలాంటి పోకడలు చూశామని... ఇప్పుడు మీడియా అణచివేత తెగులు ఏపీకి కూడా సోకిందని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయాలనుకోవడం పిరికిపంద చర్య అని అన్నారు. ఏబీఎన్, టీవీ5లపై నిర్బంధాన్ని వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
ABN
TV5
Andhra Pradesh
Dasoju Sravan

More Telugu News