Jammu And Kashmir: దేశ విభజన అన్నది చరిత్రలో అతిపెద్ద తప్పు: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

  • నాడు విభజన జరగకపోయి ఉంటే నేడు ఈ చర్చలు ఉండేవి కావు
  • కొంత మంది ఆకాంక్షల కోసమే విభజన
  • ఈ ఒక్క దుర్ఘటన కారణంగా దేశం వెనక్కి వెళ్లిపోయింది

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక భారతదేశ చరిత్రలో దేశ విభజనను అతిపెద్ద తప్పుగా ఆయన అభివర్ణించారు. నాడు దేశ విభజన జరగకపోయి ఉంటే నేడు కశ్మీర్ సమస్య ఉండేదే కాదని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన విశ్వహిందూ పరిషత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద తప్పు దేశ విభజనేనని పేర్కొన్నారు. విభజన ఇష్టం లేని గాంధీ తొలి స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనకుండా బెంగాల్ వెళ్లిపోయారని పేర్కొన్నారు. కొంతమంది ఆకాంక్షల కోసమే దేశ విభజన జరిగిందని మంత్రి అన్నారు. నాడు దేశ విభజన జరగకపోయి ఉంటే నేడు జమ్మూకశ్మీర్ గురించి, ఆర్టికల్ 370 రద్దు గురించిన చర్చలే ఉండేవి కావని స్పష్టం చేశారు. చరిత్రలో ఒక్క దుర్ఘటన కారణంగా నేడు ఎంతో వెనక్కి వెళ్లిపోయామని జితేంద్ర సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News