Telugudesam: నేను చేయని నేరానికి శిక్ష వేయాలని అంటున్నారు!: నన్నపనేని రాజకుమారి

  • జీవితంలో ఎప్పుడూ ఇంత మనోవేదన చెందలేదు
  • నాపై ఇంత అపవాదు ఎప్పుడూ పడలేదు
  • నాకు శిక్ష వేయాలనడం ఎంత వరకు సమంజసం?

దళిత మహిళా ఎస్సైను కులం పేరిట దూషించారన్న ఆరోపణలపై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిపై వైసీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకుమారి స్పందిస్తూ, ‘జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేనంత మనోవేదనను నేను అనుభవిస్తున్నాను. ఇంత అపవాదు యాభై ఏళ్ల సంఘ సేవా జీవితంలో, నలభై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడలేదు. ఈరోజు నేను చేయని నేరానికి శిక్ష వేయాలని వాళ్లు అంటున్నారు. ఎంత వరకు సమంజసమో ఆలోచించండి’ అని అన్నారు.

‘నేను ఏంటో, నా జీవితం ఏంటో అందరికీ తెలుసు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేను మూడు సంవత్సరాల ఏడు మాసాలు చేశాను. ఇంకా పదహారు.. పద్దెనిమిది నెలలు ఉందనగా నేను రాజీనామా చేసే పరిస్థితులు వచ్చాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News