Devineni Uma: మీ అవినీతి, అసమర్థతలు బయటపడతాయని టీవీ చానళ్ల ప్రసారాలు నిలిపివేస్తారా?: దేవినేని ఉమ

  • రాష్ట్రంలో కొన్ని చానళ్ల ప్రసారాలు నిలిపివేశారంటూ టీడీపీ ఆగ్రహం
  • ఇదేమన్నా రాచరికం అనుకుంటున్నారా? అంటూ ఉమ వ్యాఖ్యలు
  • మీడియా స్వేచ్ఛను హరించడం దుర్మార్గం అని విమర్శలు
రాష్ట్రంలో రెండు వార్త చానళ్ల ప్రసారాలను నిలిపివేశారంటూ టీడీపీ నేతలు వైసీపీపై మండిపడుతున్నారు. అధినేత చంద్రబాబు ఇప్పటికే ఈ విషయంలో ఘాటుగా స్పందించగా, తాజాగా సీనియర్ నేత దేవినేని ఉమ కూడా విమర్శలు చేశారు. మీ అవినీతి, అసమర్థతలు బయటపడతాయని భయపడి టీవీ చానళ్ల ప్రసారాలు నిలిపివేస్తారా? అంటూ మండిపడ్డారు. బెజవాడలో వైసీపీ మంత్రులు ఎంఎస్ఓలను బెదిరించారని ఆరోపించారు. ఇదేమన్నా రాచరికం అనుకుంటున్నారా అని నిలదీశారు. మీడియా స్వేచ్ఛను కాలరాయాలని చూడడం దారుణమని ఉమ అభిప్రాయపడ్డారు.
Devineni Uma
Telugudesam
Andhra Pradesh
YSRCP
Jagan
Chandrababu

More Telugu News