Telugudesam: కేసు పెట్టే వాళ్లకు కొంచమన్నా బుర్ర ఉండాలిగా?: నన్నపనేని రాజకుమారి

  • సంఘ సేవా భావంతో పని చేసే నాకు మంచి పేరు ఉంది
  • ఆ పేరు పోగొట్టేందుకు కుటిలయత్నం చేస్తున్నారు
  • ఉద్రిక్త పరిస్థితి ఉన్న సమయంలో కులప్రస్తావన ఎవరైనా చేస్తారా?

దళిత ఎస్సైని కులం పేరుతో దూషించారన్న ఆరోపణలపై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆమెను తక్షణం అరెస్టు చేయాలని వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో నన్నపనేని రాజకుమారి స్పందించారు. తనకు ఉన్న మంచి పేరును పోగొట్టాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

సంఘ సేవా భావంతో పని చేస్తున్న తనకు మంచిపేరు ఉందని, దాన్ని పోగొట్టాలని చూస్తున్నారని, ‘అది సాధ్యం కాదు’ అని అన్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సమయంలో ఓ కానిస్టేబుల్ నో లేక ఎస్ఐనో ‘నీ కులం ఏంటి? అని అడుగుతారా? ఫలానా కులం అని చెప్పి వాళ్లు మన మీదకు వస్తారా? అసలు, అక్కడ  కులం ప్రస్తావన దేనికొచ్చింది? కేసు పెట్టే వాళ్లకు, ప్రోత్సహించి కేసు పెట్టమని బలవంతం చేసే వాళ్లకు కొంచమన్నా బుర్ర ఉండాలిగా?’ అని ప్రశ్నించారు.

 ‘మన రాజకీయనాయకులు ఒకరికొకరు ప్రత్యర్థులు కావచ్చు. మీ పార్టీకి మా పార్టీకి పడకపోవచ్చు. కానీ, ఉద్యోగస్తులు శాశ్వతంగా ఉంటారు కదా, వాళ్లను ఎందుకు బలి చేయాలి?’ అని ప్రశ్నించారు.

More Telugu News