Jagan: మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది: నీతి అయోగ్ కు స్పష్టం చేసిన సీఎం జగన్

  • విభజన కారణంగా ఏపీ బాగా నష్టపోయిందని వెల్లడి
  • నీతి అయోగ్ సహకరించాలని కోరిన జగన్
  • రాష్ట్రానికి ఉదారంగా సాయం చేయాలని అర్థించిన ఏపీ సీఎస్

నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం ఈ మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా జగన్ రాష్ట్ర పరిస్థితులను నీతి అయోగ్ బృందానికి ఏకరవు పెట్టారు. విభజన కారణంగా ఏపీ బాగా నష్టపోయిందని, కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, నిరక్షరాస్యత నిర్మూలనకు కేంద్రం సహకరించాలని జగన్ కోరారు.

అటు, ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఇదే తరహాలో కేంద్రం సాయాన్ని అర్థించారు. విభజన కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన నష్టాన్ని పూడ్చడం నీతి అయోగ్ కే సాధ్యమని, ఉదారంగా సాయం చేయాల్సిన తరుణం ఇదని పేర్కొన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై విభజన చట్టంలో హామీ ఇచ్చారని, ఈ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

  • Loading...

More Telugu News